ముంబై : లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 50వ బర్త్‌డే సందర్భంగా మాజీ జట్టు సహచరులు సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేందర్ సెహ్వాగ్ నుంచి బీసీసీఐ సెక్రటరీ జే షా వరకూ మాస్టర్ బ్లాస్టర్‌కు విషెస్ వెల్లువెత్తాయి. పెద్దసంఖ్యలో అభిమానులు, ప్రజలు సచిన్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందచేశారు.
ఇక సచిన్‌తో కలిసి యూట్యూబర్ యష్‌రాజ్ ముఖటె చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈ క్లిప్‌లో ముఖటె సౌండ్ మిక్సింగ్ ఇంటెలిజెన్స్‌కు టెండూల్కర్ స్వాగ్ తోడయింది. టెండూల్కర్ అనే పదంతో ఈ వీడియో మొదలవుతుంది.
సచిన్ సర్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఓ పాటను రూపొందించిన విషయం జీవితంలో హైలైట్‌గా నిలుస్తుంది! అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 4.69 లక్షల మంది వీక్షించారు. ఈ ఫన్ క్లిప్‌ను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేశారు. హ్యాపీ బర్త్‌డే మాస్టర్ బ్లాస్టర్ అంటూ కామెంట్స్ సెక్షన్‌ను యూజర్లు శుభాకాంక్షలతో హోరెత్తించారు.
Read More