రంగారెడ్డి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/షాబాద్/చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్ : మీర్జాగూడ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ ఇన్చార్జి దేశమళ్ల ఆంజనేయులు, వికారాబాద్ జిల్లా నేతలు నాగేందర్‌గౌడ్, శుభప్రద పటేల్ తదితరులతో కలిసి చేవెళ్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేైండ్లెనా రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.