యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పునః ప్రారంభం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్చి 22నుంచి 28 తేదీ వరకు జరిగే సుదర్శన మహాయగానికి కావాల్సిన స్థలాన్ని కేటాయించగా యాగశాలకు కావాల్సిన ఏర్పాట్లపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. మొత్తం 1008 యజ్ఞ గుండలాలో మహాద్భుతంగా నిర్వహించే యాగాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఈఎన్సీ గణపతిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ పరిశీలించారు. ప్రధానంగా యజ్ఞాలలో పాల్గొనే రుత్వికులకు కావాల్సి హవాస కేంద్రాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను సారం కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం, లక్ష్మీపుష్కరిణిలతో పాటు ఆ పక్కనే రుత్వికులు ఉండేందుకు ప్రత్యేకమైన కాటేజీలు, డైనింగ్ హాల్స్, వంటగది, సామగ్రి భద్రపరిచే గది, స్నానాలగది, టాయిలెట్స్ నిర్మాణాలపై వైటీడీఏ అధికారులకు సూచించారు.
అనంతరం రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభంకానున్న వీవీఐపీ విలుదలైన ప్రెసిడెన్సియల్ సూట్‌ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో వైటీడీఏ ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి, డీఈఈ సునీల్‌కుమార్, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.