న్యూఢిల్లీ, జనవరి 21: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ట్రంప్ 7 దేశాలపై సైనిక దాడులు నిర్వహించడం, వెనెజువెలా అధ్యక్షుడిని ఆయన నివాసం నుంచి నిర్బంధించి అమెరికాకు తీసుకురావడం, డజన్ల కొద్దీ దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించడం, అనేక దేశాధినేతలను అవమానించడం, యావత్ పశ్చిమ ప్రాంతంపై తన ఆధిక్యాన్ని బహిరంగంగా ప్రదర్శించడం వంటి దుందుడుకు చర్యలకు పాల్పడ్డారు. ట్రంప్ ఏం చేస్తున్నారన్నది ప్రశ్న కాదు. ఆయన ఎందుకు చేస్తున్నారనేదే అసలు ప్రశ్న. ట్రంప్ తన ఇష్ట ప్రకారం తోచినట్లు చేసుకుపోతున్నారా లేక మారుతున్న ప్రపంచంలో పతనమైపోతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని తమ పెత్తనం ఎక్కడ చేజారిపోతుందోనన్న భయంతో ఇవి చేస్తున్నారా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గడచిన ఏడాదిలో ట్రంప్ చర్యల చిట్టా ఇలా ఉంది.
దేశాధినేతలకు అవమానం
డిపోర్టేషన్లు, సుంకాలు
అధికారం చేపట్టాక ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల ఏరివేత ప్రారంభించారు. లక్షలాది మంది అక్రమ వలసదారులను చేతికి, కాళ్లకు సంకెళ్లు వేసి నేరస్తుల్లా పరిగణిస్తూ సైనిక విమానంలో డిపోర్ట్ చేశారు. వారిలో వందల సంఖ్యలో భారతీయులు కూడా ఉన్నారు. 2025 ఏప్రిల్ 2న అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. అప్పటి నుంచి సుంకాలను ఆయుధంగా ఆయన ఉపయోగిస్తున్నారు. జూలైలో భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న దేశాలు అదనంగా 25 శాతం సుంకాలు చెల్లించాలని ఆదేశించిన ట్రంప్ గ్రీన్లాండ్ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలపై 10 శాతం సుంకాలు ప్రకటించారు. సుంకాల సాయంతో 10 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపానని ట్రంప్ ప్రకటించారు.
7 దేశాలపై దాడులు
7 దేశాలపై ట్రంప్ కన్ను
ట్రంప్ చర్యల
1823 డిసెంబర్ 2న అమెరికా ఐదో అధ్యక్షుడు జేమ్స్ మన్రో అమెరికన్ కాంగ్రెస్‌కు ఓ విధాన పత్రాన్ని సమర్పించారు. దాన్ని మన్రో సిద్ధాంతంగా వర్ణిస్తారు. దీని ప్రకారం ప్రపంచాన్ని రెండుగా విభజించాలి. ఒకటి పాత ప్రపంచం. అంటే యూరపు అని అర్థం. రెండవది కొత్త ప్రపంచం. అంటే అమెరికా. ఆ రెండు ప్రపంచాల రాజకీయ వ్యవస్థలు భిన్నమని, అవి ఎప్పటికీ విడిగానే ఉండాలని ఆ సిద్ధాంతం చెబుతున్నది. అమెరికా ఖండంలో(ఉత్తర, దక్షిణ అమెరికా) యూరోపియన్ దేశాలు జోక్యం చేసుకోలేవు. ఒకవేళ జోక్యం చేసుకుంటే దాన్ని శత్రుత్వంగా, తమ భద్రతకు ముప్పుగా పరిగణించాలి. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బంధించిన అనంతరం విలేకరుల సమావేశంలో ట్రంప్ మన్రో సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. తమ నూతన జాతీయ భద్రతా వ్యూహం కారణంగా పశ్చిమ అర్ధగోళంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎన్నటికీ ప్రశ్నించలేరని ట్రంప్ ప్రకటించారు. పశ్చిమ అర్ధగోళంలో నివసించే తాము అమెరికా ప్రత్యర్థుల కార్యకలాపాలను ఇక్కడ అంగీకరించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ప్రకటించడం మన్రో సిద్ధాంతంలో భాగంగానే చూడాలి. ప్రపంచం పశ్చిమ, తూర్పు అర్ధగోళాలుగా విడిపోయి ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు పశ్చిమ అర్ధగోళంలో ఉంటాయి. దీన్నే అర్ధ ప్రపంచంగా పిలుస్తారు. దీనిపైనే ట్రంప్ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారు.
ట్రంప్‌ను అడ్డుకునేవారెవరు?
సముద్రయానంపై అమెరికా ఆధిపత్యాన్ని తిప్పికొట్టేందుకు బ్రిక్స్‌తోపాటు మరికొన్ని దేశాలు జనవరి 9 నుంచి 16 వరకు దక్షిణాఫ్రికాలోని సైమన్స్ టౌన్ హార్బర్ వద్ద నావిక, వైమానిక విన్యాసాలు నిర్వహించాయి. విల్ ఫర్ పీస్ 2026 పేరిట నిర్వహించిన ఈ విన్యాసాల్లో చైనా, రష్యా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు పాల్గొన్నాయి. భారత్, బ్రెజిల్ మాత్రం పాల్గొనలేదు. అయితే ట్రంప్ ఆధిపత్య ధోరణికి కళ్లెం వేయగల సామర్థ్యం రష్యాకు ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధం ఆ దేశాన్ని ఆయుధ సంపత్తిపరంగా, సైనిక సిబ్బంది పరంగా క్షీణింపచేస్తున్నది. ఆర్థికంగా కూడారష్యా ఇబ్బందులు పడుతున్నది. ఇటువంటి పరిస్థితిలో అమెరికాను రష్యా నేరుగా ఢీకొనే అవకాశం కనిపించడం లేదు. ఆర్థికంగా శక్తివంతంగా ఉన్న చైనా ప్రతి అవకాశాన్నీ తన స్వీయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నది.