మొరెనా : మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా హెతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఖజురహో-ఉదయ్‌పూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగిందని వదంతులు వ్యాపించడంతో అలారం చైను లాగారు. వెంటనే ప్రయాణికులు రైలు దిగి వేరే పట్టాలపైకి వేగంగా వచ్చారు. ఈ క్రమంలో ఆ పట్టాలపై దూసుకొచ్చిన పాతాళ్ కోట్ ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పలువురు గాయపడ్డారు. అయితే జనరల్ కోచ్‌లో ఒక ప్రయాణికుడు అలారం గొలుసు లాగడంతో రైలు ఆగిపోయిందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు కదులుతున్నప్పుడు లేదా ఆగి ఉన్నప్పుడు అనుమతి లేకుండా దిగొద్దని రైల్వే యంత్రాంగం ఈ సందర్భంగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది