హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. విలీన ప్రక్రియ పూర్తికాకముందే బస్‌భవన్‌లోని నాలుగు ఫ్లోర్లను ఐటీ, జీఎస్టీ అధికారులకు కేటాయించడం కొత్త వివాదానికి దారి తీసింది. ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లు కేటాయించిందంటూ బుధవారం సదరు అధికారులు ఏ బ్లాక్‌లోని నాలుగు ఫ్లోర్లకు ఆర్టీసీ వేసిన తాళాలు పగులగొట్టి, వారు కొత్త తాళాలు వేసుకున్నారు. విలీనం కాకముందే బస్ భవన్, ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ కింద ఉన్న బస్‌భవన్‌పై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటని ఆగ్రహం కార్మిక సంఘాలు వ్యక్తంచేశాయి. ఈ మేరకు గురువారం సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మహిళా రైతుల నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీ వంగా ఎన్నికైంది. మార్చి 31న యా దాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట లో జరిగిన మహిళా రైతు సదస్సులో ఈ ఎన్నిక జరిగింది. మహిళా రైతుల రాష్ట్ర కన్వీనర్‌గా కందాల ప్రమీల, కో- కన్వీనర్లుగా శీలం పకీరమ్మ, కొప్పుల రజిత, చీరిక అలివేలు ఎన్నిక య్యారు. మరో 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.