బస్‌భవన్‌లో ఐటీ, జీఎస్టీ అధికారుల పాగా.. సర్కార్ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాల ఆగ్రహం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. విలీన ప్రక్రియ పూర్తికాకముందే బస్‌భవన్‌లోని నాలుగు ఫ్లోర్లను ఐటీ, జీఎస్టీ అధికారులకు కేటాయించడం కొత్త వివాదానికి దారి తీసింది.
- ప్రత్యక్ష కార్యాచరణ దిశగా సమాలోచనలు
హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. విలీన ప్రక్రియ పూర్తికాకముందే బస్‌భవన్‌లోని నాలుగు ఫ్లోర్లను ఐటీ, జీఎస్టీ అధికారులకు కేటాయించడం కొత్త వివాదానికి దారి తీసింది. ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లు కేటాయించిందంటూ బుధవారం సదరు అధికారులు ఏ బ్లాక్‌లోని నాలుగు ఫ్లోర్లకు ఆర్టీసీ వేసిన తాళాలు పగులగొట్టి, వారు కొత్త తాళాలు వేసుకున్నారు. విలీనం కాకముందే బస్ భవన్, ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్ర చేస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ కింద ఉన్న బస్‌భవన్‌పై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటని ఆగ్రహం కార్మిక సంఘాలు వ్యక్తంచేశాయి. ఈ మేరకు గురువారం సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించాయి.
మహిళా రైతుల రాష్ట్ర కన్వీనర్‌గా ప్రమీల
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మహిళా రైతుల నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీ వంగా ఎన్నికైంది. మార్చి 31న యా దాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట లో జరిగిన మహిళా రైతు సదస్సులో ఈ ఎన్నిక జరిగింది. మహిళా రైతుల రాష్ట్ర కన్వీనర్‌గా కందాల ప్రమీల, కో- కన్వీనర్లుగా శీలం పకీరమ్మ, కొప్పుల రజిత, చీరిక అలివేలు ఎన్నిక య్యారు. మరో 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

