హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్, యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎస్డబ్ల్యూ, బహుజన కార్మిక యూనియన్, బహుజన వరర్స్ యూనియన్, కార్మిక పరిషత్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సమస్యల పరిషారం కోసం, సంస్థ పరిరక్షణ కోసం ఆయా సంఘాలు జేఏసీగా సంయుక్తంగా నూతన జేఏసీని ఎన్నుకున్నాయి.
జేఏసీ చైర్మన్‌గా ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్‌గా ఎం థామస్‌రెడ్డి (టీఎంయూ ప్రధాన కార్యదర్శి) ఎన్నికయ్యారు. కమిటీ కన్వీనర్‌గా ఎండీ మౌలానా, కో కన్వీనర్లుగా కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, ప్రధాన కార్యదర్శి బీ యాదగిరి, కోశాధికారి యాదయ్య, మీడియా ఇన్చార్జులుగా పాటి అప్పారావు, ఎన్ కమలాకర్గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.