శేరిలింగంపల్లి, డిసెంబర్ 11 : నగరంలోని లింగంపల్లి నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) శనివారం వజ్ర ఏసీ బస్సు సర్వీసులు ప్రారంభించింది. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ బస్‌డిపో నుంచి సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. బస్సులు లింగంపల్లి జంక్షన్ నుంచి జూబ్లీ బస్టాండ్, ఉప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట మీదుగా కొండపైకి చేరుకొంటాయని హెచ్‌సీయూ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. లింగంపల్లి నుంచి ఉద యం 6:40, 7:20 గంటలకు బయలుదేరుతాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.