కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) విభాగంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ
కవాడిగూడ, అక్టోబర్ 26: వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) విభాగంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఎన్‌హెచ్‌ఎంలు అందించిన సేవలు మరువలేనివన్నారు.
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎన్‌హెచ్‌ఎంలు పోరాటం సాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద కొనసాగుతున్న ధర్నాలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్యానా, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ర్టాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు గుర్తించడంలేదని ప్రశ్నించారు. ఎన్హెచ్ఎంల జీతాలు పెరిగింది కేసీఆర్ హయాంలోనేనని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ నాయకులు డాక్టర్ పుట్టా మహేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి రుక్ముద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్‌కుమార్, జైపాల్‌రెడ్డి, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

