Home
Telangana
Mlc Pochampally Srinivas Reddy Pledges Five Years Of Medical Education Fees For Neet Ranker Pavithra
పేదింటి విద్యార్థినికి పోచంపల్లి ఆపన్నహస్తం
పెద్దకొర్పోలుకు చెందిన పవిత్రకు నీట్లో 5218 ర్యాంక్.. ఐదేండ్ల వైద్యవిద్య ఫీజు చెల్లింపునకు ఎమ్మెల్సీ హామీ.. మొదటి సంవత్సరం ఫీజు చెల్లింపు.
నెక్కొండ, అక్టోబర్ 26: పేదరికం అడ్డంకి కానేకాదన్న సంకల్పంతో కష్టపడి చదివిన ఓ గ్రామీణ విద్యార్థినికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అండగా నిలిచారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకొర్పోలు గ్రామానికి చెందిన రైతు బాదావత్ శోభన్ కుమార్తె పవిత్ర నీట్లో ఆల్ ఇండియా స్థాయిలో 5218 ర్యాంకు సాధించి కామినేని మెడికల్ కళాశాలలో ప్రభుత్వ వైద్య సీటు పొందింది.
వైద్య విద్యను కొనసాగించేందుకు ఏటా కాలేజీ, హాస్టల్ ఫీజులు కలిపి రూ.3 లక్షలు చెల్లించాలి. ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న శోభన్ కుటుంబానికి ఇది భారంగా మారింది. విషయం తెలుసుకున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఐదేండ్లపాటు ట్యూషన్, హాస్టల్ ఫీజు చెల్లించేందుకు హామీ ఇచ్చి.. మొదటి సంవత్సరం ఫీజు చెల్లించేశారు. పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్సీకి కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

