సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు ఓ వ్యాపారికి రూ.8 లక్షలు టోకరా వేశారు. బాధితుడు నౌకరీ. కామ్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా.. డెలాయిట్ కంపెనీలో ఉద్యోగం ఉందని, అది కూడా కెనడాలో ఉందంటూ నేరగాళ్లు నమ్మించారు. ఇంటర్వ్యూతో పాటు ప్రాసెసింగ్ ఉంటుందంటూ.. అంతకు ముందు కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన పాస్‌పోర్టు పంపాలంటూ సూచించారు. కొంత టోకెన్ అమౌంట్ కావాలని కోరారు.
మొత్తంగా రూ.8 లక్షలు కాజేసి.. ఇంకా డబ్బు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు ప్రారంభించారు.