జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇటీవల సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్‌లో సీసీ రోడ్డు వేయకుండానే వేసినట్లు బిల్లులు పెట్టి సంస్థ ఖజానాకు రూ. 8.93 లక్షల టోకరా వేసిన ఘటనలో జీహెచ్ఎంసీకి చెందిన ఏఈ అన్సారీని విధుల నుంచి టర్మినెట్ చేశారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఏకాంబరంపై సస్పెన్షన్ వేటు వేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. సదరు కాంట్రాక్ట్ సంస్థ నుంచి డబ్బులను రికవరీ చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ ఘటన మరువకముందే ఇదే ఐఎస్ సదన్ డివిజన్లో మరో అవినీతి బాగోతం బట్టబయలైంది. వరద నీటి కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేయకుండానే రూ. 53.59 లక్షల బిల్లులు స్వాహా చేశారు. కాంట్రాక్టర్, ఇంజినీర్లు మేజర్మెంట్(ఎంబీ)లో రికార్డులు సృష్టించి ఖజానాకు గండి కొట్టారు.
సిటీబ్యూరో/సైదాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : వరద నీటి కాలువ ఆధునీకరణ పనులు చేయకుండానే.. చేసినట్లుగా దొంగ రికార్డులు సృష్టించి బిల్లులను స్వాహా చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. తూతూ మంత్రంగా పనులు చేసినట్లు చూపించి మొత్తం బిల్లులను కాజేసే కుట్రకు తెరలేపారు. ఐఎస్ సదన్ డివిజన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి మరో సారి వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మకై సీసీ రోడ్డు వేయకుండానే రూ. 10 లక్షలు స్వాహా చేసిన విషయం మర్చిపోకముందే, అదే తరహా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని దామోదర సంజీవయ్య నగర్లో వర్షాకాలంలో తరచూ ఎదురవుతున్న వరదనీటి ఇబ్బందులను నివారించేందుకుగాను ప్రస్తుతం ఉన్న నాలాను బాక్స్ డ్రైన్‌గా నల్ల పోచమ్మ టెంపుల్ నుంచి ఎక్సైజ్ కాలనీ వరకు బాక్స్ డ్రైయిన్ ఆధునీకరణకు రూ. 90 లక్షలు కేటాయించి టెండర్లను ఆహ్వానించారు.
బాక్స్ డ్రైయిన్ టెండర్లను సైదులు నాయక్ అనే కాంట్రాక్టర్ వాటి పనులను 2021 జూన్‌లో స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొని పనులను ప్రారంభించారు. రెండు రోజుల పాటు కొద్ది పనులను తూతూ మంత్రంగా మొదలుపెట్టి నాలుగు పైపులు వేసి అలాగే వదిలేశాడు. ఈ విషయాన్ని స్థానికులు అధికారులను, కాంట్రాక్టర్‌ను అడగగా తాను అనారోగ్యంతో ఉన్నానని కోలుకోగానే పనులను ప్రారంభించి పూర్తి చేస్తానని వారికి నచ్చజెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాక్స్ డ్రైయిన్ ఆధునీకరణ నిర్మాణ పనులు చేయకుండానే, పనులు చేసినట్లు మేజర్మెంట్ (ఎంబీ)లో ఇటీవల రికార్డులు సృష్టించి బిల్లులు పెట్టి రూ.53 లక్షలు, 59 వేల 330 రూపాయలు కాజేసేందుకు ప్రయత్నాలు పెట్టి స్వాహా చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని స్థానిక కార్పొరేటర్ ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకోగా ఈ అవినీతి తంతు వెలుగులోకి రావడం గమనార్హం. ఒక్క డివిజన్‌లోనే ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే మిగిలిన 149 డివిజన్లలో ఏ మేరలో అక్రమాలు జరిగాయన్న చర్చ లేకపోలేదు. లక్షల జీతాలు తీసుకునే ఇంజనీర్లు అక్రమార్జనకు బరితెగించడంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. అవినీతి సొమ్ముకు అలవాటు పడి ఇటీవల కొందరు ఏసీబీకి చిక్కుతున్న.. ఇంజినీర్లలో ఏ మాత్రం మార్పు కనబడకపోవడం విస్మయం వ్యక్తం చేస్తున్నారు
వెలుగులోకి వచ్చిందిలా..
డీఎస్ నగర్‌లోని పోచమ్మ ఆలయం నుంచి సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వరకు వరద నీటి కాలువ బాక్స్ డ్రైన్ ఆధునీకరణ పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేస్తున్నట్లు తెలియడంతో జంగం శ్వేతా రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. డీఎస్ నగర్లో వరద నీటి కాలువ పనులు నిర్మాణానికి 2021 జూన్‌లో రూ .90 లక్షల నిధులు మంజూరై టెండర్ పక్రియ పూర్తి చేశారు. కానీ జీహెచ్ఎంసీ అధికారుల అండతో పనులు చేయకుండానే చేసినట్లు అధికారుల తప్పుడు రికార్డులు మిగతా IIవ పేజీలో