హైదరాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ( RIMS ) లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ( Ex-gratia ) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ( Damodara Raja Narasimha) ప్రకటించారు.
ఆదిలాబాద్‌లోని వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే పిల్లలను హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్స్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. రిమ్స్‌లో 150 బెడ్ల మాతా శిశు ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. అత్యాధునిక వసతులతో ఎంసీహెచ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.