పగ్వారా: పంజాబ్‌కు చెందిన ఓ టోల్ ప్లాజా(Toll Plaza) క్యాషియర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 24 లక్షలు చోరీ చేశారు. ఈ ఘటన పిల్లౌర్ బస్ స్టాండ్ వద్ద ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకున్నది. లదువాల్ టోల్ ప్లాజాకు చెందిన క్యాషియర్ సౌదాగర్ సింగ్.. తన వద్ద ఉన్న 24 లక్షలను బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు ఫిల్లౌర్ బ్యాంక్‌కు వెళ్లారు. క్యాషియర్ సౌదాగర్ సింగ్‌తో పాటు డ్రైవర్ అనిశ్ కుమార్ వెళ్తున్న కారును .. అయిదుగురు దుండగులు అటాక్ చేశారు. ఆయుధాలతో వచ్చిన ఆ నిందితులు బ్రీజా కారులో వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే గన్ పాయింట్లో క్యాషియర్ సౌదాగర్‌ను బెదిరించి, అతని వద్ద ఉన్న డబ్లును లాక్కెళ్లారు. గొరయా దిశగా దుండగులు వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.