Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 10: విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఉపసంచాలకులు గంగధారి ధనరాజ్ తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 10: వరంగల్ పాల పరిధిలోని విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి, మరమ్మతులు, మౌలిక వసతుల మెరుగుదల కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఉపసంచాలకులు గంగధారి ధనరాజ్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాల పదార్థాల సరఫరాకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాలనుసారం జిల్లా కలెక్టర్ చహత్ బాజ్‌పాయ్‌కి నివేదిక ఇవ్వడంతో నిధుల మంజూరూకు ఉత్తర్వులు జారీ చేశామని ధనరాజ్ వెల్లడించారు.
విజయ డెయిరీ అభివృద్ధి కోసం మొదటి విడతగా రూ.89.50 లక్షలు నిధులు మంజూరు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చామని తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఉపసంచాలకులు గంగధారి ధనరాజ్ తెలిపారు. విజయ తెలంగాణ డెయిరీని ఆధునీకరించి, మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు పాడి రైతులకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, ఆధునీకరణ పనుల దృష్ట్యా విజయ తెలంగాణ డెయిరీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలోని వరంగల్ డెయిరీలో ప్యాకింగ్ కార్యకలాపాలను 10న నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తామని ధన్‌రాజ్ చెప్పారు.
వినియోగదారులకు పాలు, పాల పదార్థాలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతామని ఆయన వెల్డించారు. మెగా డెయిరీ రావిర్యాల నుంచి పాలు, పాల పదార్థాలను దిగుమతి చేసి గ్రేటర్ వరంగల్ పరిధిలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కాబట్టి.. పాల పంపిణీదారులు, ఏజెంట్లు, విక్రయదారులు, వినియోగదారులు, పాడి రైతులు సహకరించాలని.. విజయ తెలంగాణ డెయిరీ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావడానికి తోడ్పడాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారంతో డెయిరీ అభివృద్ధి, పాడి రైతుల ప్రయోజనాల పరిరక్షణ, వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తుల సరఫరా, సంస్థ అభివృద్ధికి అవసరమైన చర్యలు కొనసాగుతాయని ధనరాజ్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

