KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
KTR: తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలుస్తూ, వారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఉద్యమకారుడి కుటుంబానికి ఆయన భారీ ఆర్ధిక సాయం చేశారు.
KTR: తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలుస్తూ, వారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఉదారత చాటుకున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి ఆయన భారీగా ఆర్ధిక సాయం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో అనారోగ్యంతో కన్నుమూసిన ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ (Eduru Janardhan) ఫ్యామిలీకి రూ.10 లక్షలు అందించి అండగా నిలిచారు కేటీఆర్.
తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న వేళ మేమున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. ఇటీవల అనారోగ్యం మరణించిన ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసా ఇచ్చారు. అతడి ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయించిన కేటీఆర్.., కుటుంబానికి రూ.లక్ష తక్షణ ఆర్థిక సహాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మహిళా నేతలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం జనార్థన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన వారిలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ మాలోతు కవిత, తదితరుల ఉన్నారు.
అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించి, అండగా నిలిచిన కేటీఆర్
మహబూబాబాద్ జిల్లాలో అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్
అతని ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్, కుటుంబానికి రూ.లక్ష తక్షణ ఆర్థిక సహాయం అందించిన కేటీఆర్
కేటీఆర్ ఆదేశాల మేరకు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2026
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

