టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR ). భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్ అందాల తార శ్రియా శరణ్ (Shriya Saran)కీ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. తన యాక్టింగ్‌తో అందరినీ మెప్పించింది శ్రియ. ఆదివారం నాడు ఈ భామ 40వ పడిలోకి అడుగుపెట్టింది.
ఈ స్పెషల్ మూమెంట్స్ ను ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంలో వేడుక చేసుకుంది. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటో ఊహించే ఉంటారు..సెలబ్రిటీ ఫేవరేట్ టూరిజం స్పాట్ మాల్దీవులు (Maldives). శ్రియ భర్త ఆండ్రీవ్ కొఛీవ్, కూతురు రాధతో సింపుల్‌గా పుట్టినరోజు జరుపుకుంది. మాల్దీవుల్లో శ్రియ షికారు, సందడి వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ బ్యూటీ నెక్ట్స్ కబ్జా, మ్యూజిక్ స్కూల్ తోపాటు పలు సినిమాలను లైన్లో పెట్టింది. నెట్టింట చురుకుగా ఉండే శ్రియ మరి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు షేర్ చేసుకుంటుందా..? అని ఎదురుచూస్తున్నారు ఆమె ఫాలోవర్లు, అభిమానులు.