మిలాన్, నవంబర్ 4: మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ టూవీలర్లు రాబోతున్నాయి. వచ్చే ఏడాది ఫ్లైయింగ్ ఫ్లీ బ్రాండ్ పేరిట ఈ-బైకుల్ని పరిచయం చేయబోతున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఇక్కడ జరుగుతున్న గ్లోబల్ టూవీలర్ ఎగ్జిబిషన్ ఈఐసీఎంఏలో ఫ్లైయింగ్ ఫ్లీ ఎస్6ను రాయల్ ఎన్ఫీల్డ్ ప్రదర్శించింది.
ఈ సందర్భంగా సంస్థ సీఈవో, ఐషర్ మోటర్స్ లిమిటెడ్ ఎండీ బీ గోవిందరాజన్ పీటీఐ వీడియోస్తో మాట్లాడుతూ.. 2026లో తొలుత ఫ్లైయింగ్ ఫ్లీ సీ6, ఆ తర్వాత ఎస్6 మాడళ్లను యూరప్ దేశాల్లో విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత భారతీయ మార్కెట్లోకి తెస్తామని చెప్పారు.