న్యూఢిల్లీ, నవంబర్ 4: హిందుజా గ్రూపు చైర్మన్ గోపిచంద్ పీ హిందుజా కన్నుమూశారు. 85 ఏండ్ల వయస్సు కలిగిన ఆయన లండన్లోని ఓ హాస్పిటల్లో మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మంగళవారం కన్నుమూసినట్టు చెప్పారు.
హిందుజా గ్రూపు ప్రమోటర్లలో ఒకరైన శ్రీచంద్ 2023లో మరణించిన నాటి నుంచి గోపిచంద్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీతా ఉన్నారు.