Bajaj Finance | హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్-బ్యాంకింగ్ రుణదాత, బజాజ్ ఫిన్‌సర్వ్‌లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఈ పండుగ సీజన్లో వినియోగ ఫైనాన్స్‌లో పెరుగుదల కనిపించింది. రికార్డు స్థాయిలో బజాజ్ ఫైనాన్స్ రుణాల్లో 27 శాతం పెరుగుదల కనిపించింది. జీఎస్టీ సంస్కరణలు, వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో మార్పుల కారణంగా కొనుగోళ్లు పెరిగాయి. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు సుమారు 63 లక్షల రుణాలను పంపిణీ చేసింది. ఇక కొత్తగా 23 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించింది.
“రోజువారీ ఉత్పత్తుల ధరలను తగ్గించడంతో లక్షలాది మధ్య, తక్కువ ఆదాయ కుటుంబాలు ఎక్కువ ఖర్చు చేయడానికి దోహదం చేసింది. వినియోగ రుణాల పంపిణీలో 27 శాతం అధిక పంపిణీలో సానుకూల ప్రభావం చూపించింది. మెరుగైన జీవనశైలి కోసం వినియోగదారులు ఎక్కువ నాణ్యత ఉండే వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పండుగ సీజన్లో మా కొత్త కస్టమర్లలో సగానికి పైగా కొత్తగా క్రెడిట్ పొందారు. అధికారిక ఆర్థిక వ్యవస్థ నుంచి చాలా మంది మొదటి లోన్ తీసుకుంటున్నారు. బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, 4,200 ప్రదేశాలలో 2,39,000 క్రియాశీల పంపిణీ పాయింట్ల వద్ద మేము ఆర్థిక చేరికను మరింతగా పెంచడం.. వినియోగదారుల పెరుగుదలకు శక్తినివ్వడం కొనసాగిస్తున్నాము అని బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ సంజీవ్ బజాజ్ అన్నారు.
టీవీలు, ఎయిర్ కండిషనర్లకు తక్కువ జీఎస్టీ విధించడంతో బెస్ట్ బ్రాండ్స్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు వీలు కలిగింది. టీవీలకు కన్స్యూమర్ ఫైనాన్సింగ్ స్పష్టమైన ప్రీమియమైజేషన్ ధోరణిని చూసింది. 40-అంగుళాలు, అంతకంటే ఎక్కువ స్క్రీన్ల కోసం రుణాలు కంపెనీ ద్వారా ఫైనాన్స్ చేసిన మొత్తం టీవీలలో 71 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గత సంవత్సరం ఇది 67 శాతంగా ఉంది. మొబైల్ ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నిచర్, రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్లు, అనేక ఇతర వినియోగ-ఆధారిత వర్గాల ఫైనాన్సింగ్‌లో గణనీయమైన ఉనికిని చాటుకున్నాం అని సంజీవ్ బజాజ్ చెప్పుకొచ్చారు.
బజాజ్ ఫైనాన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్-గ్రౌండ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల ద్వారా 110 మిలియన్ల కస్టమర్ ఫ్రాంచైజీకి సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. జూన్ 30, 2025 నాటికి 75.1 మిలియన్ల నికర ఇన్స్టాల్లతో బజాజ్ ఫిన్సర్వ్ యాప్ వేగవంతమైన సేవలను అందిస్తోందన్నారు. సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ ప్రారంభానికి గుర్తుగా నిలిచాయని సంజీవ్ బజాజ్ తెలిపారు.