ఫేవరేట్ జెర్సీలో 15 ఏళ్ల జర్నీ: రోహిత్ శర్మ
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లోకి రోహిత్ శర్మ అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు నిండాయి. ఈ విషయాన్ని ఆ క్రికెటర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఓ మెసేజ్ పోస్టు చేశాడతను. ఇండియా తరపున క్రికెట్లో అరంగేట్రం చేసి నేటితో 15 ఏళ్లు నిండాయని, తన జర్నీ అద్భుతంగా సాగిందని, ఇది తన జీవితాంతం గుర్తు ఉండిపోతుందని, తన జీవన గమనంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాని, తనను ఉన్నతమైన ప్లేయర్గా తీర్చిదిద్దినవారికి కూడా ప్రత్యేక థ్యాంక్స్ చెబుతున్నట్లు రోహిత్ తన ట్వీట్లో వెల్లడించారు. క్రికెట్ ప్రేమికులకు, అభిమానులకు, విమర్శకులకు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. 2007లో బెల్ఫాస్ట్లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఇంటర్నేషన్ కెరీర్ ప్రారంభమైంది. తొలుత మిడిల్ ఆర్డర్లో ఆడిన రోహిత్ ఆ తర్వాత ఓపెనర్ అవతారమెత్తాడు. 2013 తర్వాత అతని కెరీర్ దూసుకువెళ్లింది. వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్గా రోహిత్ రికార్డు క్రియేట్ చేశాడు.
𝟭𝟱 𝘆𝗲𝗮𝗿𝘀 in my favourite jersey 👕 pic.twitter.com/ctT3ZJzbPc
— Rohit Sharma (@ImRo45) June 23, 2022
రోహిత్ శర్మ 230 వన్డేలు ఆడాడు. దాంట్లో 48,60 సగటుతో 9,283 రన్స్ చేశాడు. అత్యధికంగా అతను 264 రన్స్ చేశాడు. 29 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలిచాడు. 45 టెస్టుల్లో రోహిత్ 46.13 సగటుతో 3137 రన్స్ చేశాడు. టెస్టుల్లో అతను 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక టీ20 ఫార్మాట్లో ఇండియా తరపున అతను 125 మ్యాచ్లు ఆడాడు. వాటిల్లో 3313 రన్స్ చేశాడు. టీ20ల్లో అత్యధికంగా 118 రన్స్ చేశాడు. నాలుగు సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

