ముంబై సారథ్య పగ్గాలు మళ్లీ హిట్‌మ్యాన్‌కే?
ఐపీఎల్లో అత్యంత జనాధరణ కల్గిన ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్‌లో సారథ్య మార్పు జరుగబోతుందా? ఆ జట్టుకు రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మ రాబోయే సీజన్లో ఎంఐని నడిపించనున్నాడా?
ముంబై : ఐపీఎల్లో అత్యంత జనాధరణ కల్గిన ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్‌లో సారథ్య మార్పు జరుగబోతుందా? ఆ జట్టుకు రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మ రాబోయే సీజన్లో ఎంఐని నడిపించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ మేరకు ముంబై యాజమాన్యంతో హిట్‌మ్యాన్ చర్చలు జరిపాడని, 2027 సీజన్లో జట్టును నడిపించడానికి అతడు అంగీకరించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
గత రెండు సీజన్లలో వైఫల్యాల నేపథ్యంలో ప్రస్తుతం ఎంఐకి సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా వచ్చే సీజన్ నుంచి ఆ జట్టులో ఉంటాడా? లేడా? అన్నది అనుమానంగానే ఉంది. నవంబర్ 30తో ముగియనున్న ట్రేడ్ విండోతో అతడి భవితవ్యం తేలనుంది. అయితే జట్టులో సూర్యకుమార్, బుమ్రాతో పాటు యువ ఆటగాడు తిలక్ వర్మ రూపంలో కెప్టెన్సీ ఆప్షన్స్ ఉన్నా ముంబై మేనేజ్మెంట్ మాత్రం రోహిత్ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. తిలక్‌ను సారథిగా చేయాలని రోహిత్ సూచించినా రానున్న సీజన్లో జట్టును నడిపించాలని మేనేజ్మెంట్ ‘ముంబై చ రాజా’ను ఒప్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

