మనీషా పసిడి పట్టు.. వరల్డ్ చాంపియన్ గెలిచిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మనీషా భన్వాలా సరికొత్త చరిత్ర లిఖించింది. సుదీర్ఘకాలంగా ఈ టోర్నీలో విమెన్ చాంపియన్‌షిప్ లేని లోటును భర్తీ చేస్తూ శుక్రవారం జరిగిన మహిళల 59 కిలోల విభాగం ఫైనల్లో ఆమె స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించింది.
ఆస్తానా : ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మనీషా భన్వాలా సరికొత్త చరిత్ర లిఖించింది. సుదీర్ఘకాలంగా ఈ టోర్నీలో విమెన్ చాంపియన్‌షిప్ లేని లోటును భర్తీ చేస్తూ శుక్రవారం జరిగిన మహిళల 59 కిలోల విభాగం ఫైనల్లో ఆమె స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించింది. ఫైనల్లో మనీషా 8-6తో అబిగెల్ నెట్టె (యూఎస్ఏ)ను ఓడించి పసిడి పతకం సొంతం చేసుకుంది. తద్వారా ఈ టోర్నీ మహిళల విభాగంలో వరల్డ్ చాంపియన్ గెలిచిన తొలి భారత విమెన్ రెజ్లర్‌గా రికార్డులకెక్కింది.
ఓవరాల్‌గా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున స్వర్ణం నెగ్గినవారిలో సుశీల్ కుమార్ (2010లో 66 కేజీల కేటగిరీలో) తర్వాత రెండో భారత రెజ్లర్‌గా ఆమె నిలిచింది. తాజా టోర్నీలో కాజల్, నీలమ్ సైతం పసిడి పోరుకు అర్హత సాధించినా వారు రజతంతోనే సంతృప్తి చెందగా మనీషా మాత్రం పసిడి పట్టు వీడలేదు. ఫైనల్ పోరులో ఒక దశలో 0-6తో వెనుకబడ్డ ఆమె.. బ్రేక్ తర్వాత ప్రత్యర్థిని ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా తన పట్టుతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ వరుస పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లడమే గాక స్వర్ణాన్ని చేజిక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

