హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో రాకపోకలు పెరిగాయని, కోతకు గురైన రోడ్లను వెంటనే పునురుద్ధరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి పనుల పురోగతిపై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హైదరాబాద్‌లో సమీక్షించారు. నందిపహాడ్ ఎక్స్‌రోడ్డు వెహికల్ అండర్ పాస్ నిర్మాణాన్ని వేగం చేయాలని ఆదేశించారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయ వ్యభిచారం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐలయ్య.. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో కొంతమంది తమ పార్టీ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఐలయ్య, సంజీవ్ రెడ్డిపై సీఎం, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.