బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ( Procure Grain ) చేయడం లేదంటూ, లారీలు సకాలంలో పంపించడం లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మండలంలోని ఆలింపుర్, తమ్మడపల్లి గ్రామాల రైతులు రాస్తారోకోలు ( Road Blockades ) నిర్వహించారు. జనగామ- సిద్దిపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్నా, లారీలను పంపించి ధాన్యం మిల్లులకు పంపించడం లేదని ఆరోపించారు.
కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా ధాన్యం పేరుకుపోతున్న పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. కేంద్రాలకు లారీలు వచ్చేదాకా ఆందోళన విరమించమని పట్టు పట్టారు. కలెక్టర్, తహసీల్దార్ వెంటనే స్పందించాలని, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులు నినాదాలు చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
మాజీ సర్పంచులు నరెడ్ల బాల్రెడ్డి, మేకల కవిత రాజు, నాయకులు పాకాల రోహిన్, బిక్షపతి, యాదిరెడ్డి, రగోతంరెడ్డి, సిద్ధారెడ్డి, సత్తిరెడ్డి, నరసింహులు, చంద్రశేఖర్ రెడ్డి, రాజిరెడ్డి, సాగర్, ఎలుగుల శ్రీనివాస్, సిద్ధారెడ్డి, నాగిల్ల తిర్మల్ రెడ్డి., పయ్యావుల రాజు, సానిక కనకరాజు, కనుకయ్య. వేణు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.