Kyle Jamieson : ఐపీఎల్లో అమూల్యమైన వికెట్ ఎవరిది?.. ఈ ప్రశ్నకు చిన్నపిల్లాడైనా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అని ఠక్కున చెప్పేస్తారు. నిరుడు ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ చిచ్చరపిడుగు పంతొమ్మిదో సీజన్లో దంచికొట్టడం చూసినవాళ్లంతా ముక్తకంఠంతో ఇదే మాట అంటారు. అందుకే కాబోలు శుక్రవారం మ్యాచ్‌లో వైభవ్‌ను 4 పరుగులకే ఔట్ చేశాక ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైలీ జేమీసన్ (Kyle Jamieson) వైల్డ్‌గా సంబురాలు చేసుకున్నాడు. పదిహేనేళ్ల కుర్రాడి వికెట్ తీసి యమ కోపంగా ప్రవర్తించిన జేమీసన్‌ను కొందరు తిట్టిపోస్తుండగా.. మరికొందరు అందులో తప్పేముంది అని మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకూ ఈ పొడగరి పేసర్ ఏం అన్నాడో తెలుసా..?
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రీజులో ఉండడం రాజస్థాన్ రాయల్స్‌కు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థి జట్టుకు అంతకంటే అమూల్యమని చెప్పాలి. తొలి బంతి నుంచే సిక్సర్లతో విరుచుకుపడే వైభవ్‌ను ఆపితే.. సగం మ్యాచ్ గెలిచినట్టే. అందుకే.. అతడి వికెట్ దక్కితే అదే మహాభాగ్యం అనుకుంటున్నారు బౌలర్లు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైలీ జేమీసన్ వైల్డ్ సెలబ్రేషన్‌కు కారణమదే.
An in-swinging yorker 😲🔥
🎥 Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 👊
Wait for the celebration 👀
Updates ▶️ https://t.co/6OOjzHtZiD#TATAIPL | #KhelBindaas | #RRvDC | @DelhiCapitals pic.twitter.com/6vxJ5ahlb3
— IndianPremierLeague (@IPL) May 1, 2026
వయసులో తనకంటే చాలా చిన్నోడైన వైభవ్ వికెట్ ఎం వికెట్ తీశాక జేమీసన్ ఆవేశంగా సంబురాలు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నా.. అతడు మాత్రం లైట్ తీసుకున్నాడు. ‘నా జీవితంలో ఇంతవరకూ 15 ఏళ్ల కుర్రాడికి ఇంతలా భయపడింది లేదు. కానీ, వైభవ్ అద్భుతమైన క్రికెటర్. అతడి వికెట్ కోసం మేము ప్రణాళికలు రచించాం. మైదానంలో మా ప్లాన్ ఫలితాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని జేమీసన్ వెల్లడించాడు.
పంతొమ్మిదో సీజన్లో బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన వైభవ్ సూర్యవంశీ ఊచకోతను తలపించే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. సన్‌రైజ్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే శతకంతో రికార్డు నెలకొల్పిన ఈ చిన్నోడు.. డేంజరస్ బ్యాటర్‌గా గుర్తింపు సాధించాడు. అందుకని.. ప్రతి మ్యాచ్‌లో అతడిని ఔట్ చేసేందుకు బౌలర్లు వ్యూహాలు పన్నుతున్నారు. కానీ, అతడిని హిట్టింగ్‌ను ఆపడంలో విజయవంతం అవుతున్నది మాత్రం కొందరే.
Praful Hinge got Vaibhav Sooryavanshi in Hyderabad.
Round two? Four sixes in his first over.pic.twitter.com/mgscvMMDm2
— Cricbuzz (@cricbuzz) April 26, 2026
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే వైభవ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. జేమీసన్ సైతం వైభవ్ వికెట్‌ను పక్కా ప్లాన్‌తో సాధించాడు. లో ఫుల్ టాస్ వేసి.. క్లీన్‌బౌల్డ్ చేసిన జేమీసన్ ప్రపంచాన్ని గెలిచినట్టుగా సంబురాల్లో మునిగిపోయాడు. అయితే.. అతడు వైభవ్ వైపు దూసుకొచ్చి.. నోరంతా తెరిచి.. కోపంగా చూస్తూనే.. చప్పట్లు కొట్టడం విమర్శలకు తావిచ్చింది. ఐపీఎల్ కోడ్ ఉల్లంఘించినందున అతడికి రిఫరీ ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.