Road Accident | నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రాబాద్ మండలంలోని నల్లమల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో వ్యక్తిగాయపడ్డాడు. వెంటనే అతన్ని సున్నిపెంట ఆసుప్రతికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతులను హైదరాబాద్ బొల్లారానికి చెందిన వారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. తెల్లవారు జామున కావడంతో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో వేగంగా వెళ్తూ చెట్టును ఢీకొట్టిందని పోలీసులు భావిస్తున్నారు. కారులోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించగా.. అచ్చంపేట ఆసుప్రతి ఆవరణలో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.