హైదరాబాద్, ఫిబ్రవరి 11 : రాష్ట్రంలో సెకండ్‌హ్యాండ్ కార్ల అమ్మకాలు కూడా టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. కార్ల విక్రయ సంస్థ కార్స్24 తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో తెలంగాణలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయని తెలిపింది.
వీటిలో పెట్రోల్‌తో నడిచే వాహనాల వాటా 87.6 శాతంగా ఉన్నదని, డీజిల్ వాహనాల వాటా కేవలం 11.6 శాతం మాత్రమేనని కంపెనీ సీఎఫ్‌వో శివాన్షు మక్కర్ తెలిపారు. మాడళ్ల విషయానికి వస్తే మొత్తం వాహనాల్లో 4.1 శాతం వాటాతో టాటా నెక్సాన్ తొలిస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానంలో బాలెనో 3.97 శాతం, స్విఫ్ట్ 2.43 శాతంగా ఉన్నాయి. మొత్తం యూజ్డ్ కార్ల అమ్మకాల్లో ఈ మూడు మాడళ్ల వాటా 10 శాతానికి పైగా ఉన్నాయన్నారు.