ఎదులాపురం, సెప్టెంబర్ 23 : రిమ్స్ దవాఖానలోని చిన్నపిల్లల వార్డులో జరిగిన అగ్నిప్రమాదాన్ని పరిశీలించడానికి మంగళవారం హెలికాప్టర్లో ఆదిలాబాద్‌కు వచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తిరుగు ప్రయాణంలో కారులో వెళ్లాల్సి వచ్చింది. రిమ్స్‌లో చిన్న పిల్లల వార్డును పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.
తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు హెలికాప్టర్ వద్దకు రాగా, ఇంధనం తక్కువగా ఉన్నదని మహారాష్ట్రలోని నాందేడ్‌లో నింపుకొని హైదరాబాద్‌కు వెళ్తామని పైలట్ సూచించాడు. దీంతో మంత్రి దామోదరతోపాటు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ కూడా వాహనంలో నిర్మల్, కామారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే దళిత మంత్రి దామోదరకు అవమానం జరిగిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.