చల్లని ఉపశమనం
ప్రేమ విఫలమైనప్పుడు లేదా తీవ్రమైన మనస్తాపానికి గురైనప్పుడు చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకుని బావురుమనడం సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో మనం తరచూ చూసే దృశ్యం. ఇది కేవలం వెండితెర డ్రామా మాత్రమే కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ, మానసిక కారణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసు కంఫర్ట్ ఫుడ్ వైపు లాగుతుంది. ఐస్‌క్రీమ్‌లో ఉండే చకెర, కొవ్వు పదార్థాలు మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్'ను ప్రేరేపించి ‘డోపమైన్' అనే సంతోషకరమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీని చల్లని, నోరూరించే క్రీమీ టెక్స్చర్ బాధపడుతున్న మెదడుకు క్షణాల్లో సాంత్వనను చేకూరుస్తుందట.
ప్రేమ విఫలమైనప్పుడు లేదా తీవ్రమైన మనస్తాపానికి గురైనప్పుడు చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకుని బావురుమనడం సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో మనం తరచూ చూసే దృశ్యం. ఇది కేవలం వెండితెర డ్రామా మాత్రమే కాదు, దీని వెనుక బలమైన శాస్త్రీయ, మానసిక కారణాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మనసు కంఫర్ట్ ఫుడ్ వైపు లాగుతుంది. ఐస్‌క్రీమ్‌లో ఉండే చకెర, కొవ్వు పదార్థాలు మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను ప్రేరేపించి ‘డోపమైన్’ అనే సంతోషకరమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీని చల్లని, నోరూరించే క్రీమీ టెక్స్చర్ బాధపడుతున్న మెదడుకు క్షణాల్లో సాంత్వనను చేకూరుస్తుందట.
పరిశోధనల ప్రకారం.. ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు మెదడులోని భావోద్వేగ ప్రాంతాలను ఉత్తేజపరిచి తాతాలిక రిలీఫ్‌ను ఇస్తాయి. అలాగే, చిన్ననాటి తీపి జ్ఞాపకాలను కూడా గుర్తుచేస్తాయి. చిన్నప్పుడు పుట్టిన రోజులు, సెలవులు లేదా బాధలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొనిచ్చిన ఐస్‌క్రీమ్ మనసులో భద్రంగా దాగి ఉంటుంది. పెద్దయ్యాక ఒంటరితనం వేధించినప్పుడు ఆ జ్ఞాపకాలే ఐస్‌క్రీమ్‌ను ఒక మానసిక ఆసరాగా మారుస్తాయి. దీనికి తోడు ‘మనసు బాగోలేకుంటే స్వీట్ తినండి’ అంటూ వచ్చే ప్రకటనలు, పాప్ కల్చర్ కూడా ఈ అలవాటును మనలో బలంగా నాటాయి.
ముఖ్యంగా భావోద్వేగ ఒత్తిడికి గురైనప్పుడు ఎమోషనల్ ఈటింగ్ వైపు మొగ్గుచూపే ధోరణి కొందరిలో ఎకువగా ఉంటుంది. అయితే, ఐస్‌క్రీమ్ తాతాలికంగా మూడ్‌ని మార్చగలదే తప్ప బాధను శాశ్వతంగా నయం చేయలేదు. అప్పుడప్పుడు తినడం వల్ల నష్టం లేకపోయినా, ప్రతిసారీ ఆహారంతోనే భావోద్వేగాలను అణచివేయడం సరికాదు. బ్రేకప్ బాధ నుంచి బయటపడటానికి ఆప్తులతో మనసు విప్పి మాట్లాడటం, వ్యాయామం చేయడం లేదా ఇష్టమైన హాబీల్లో మునిగిపోవడమే సరైన మార్గం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

