యాప్లు, అలెక్సాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లు ఏలే ఈ రోజుల్లో ప్రేమను కొలిచే కొలమానాలు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాలు, తర్వాత మెసేజ్లు… మరి ఇప్పుడు మన బంధాలనుఎలా బలపరచుకోవచ్చో గమనించారా? పక్కన అంటే ఇక్కడే: పక్కపక్కనే ఉన్నా ఫోన్లలో మునిగి పోవడం కాకుండా.. శరీరంతో పాటు మనసునూ ఇక్కడే ఉంచాలి. అది కూడా వాళ్ల కోసం ఒక్క నిమిషం ఫోన్ పక్కన పెట్టి ‘చెప్పు’ అన్నట్టు కాకుండా, హాయిగా మనసు విప్పి ఎదుటివారితో మాట్లాడటం. ఆఫీసు ఒత్తిళ్లూ, ఆలోచనలకూ ఇక్కడ నో ఎంట్రీ.
నో-గ్యాడ్జెట్ అవర్: టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా, రోజులో కనీసం ఒక గంట అన్ని డివైజ్లను పకనపెట్టి కేవలం ఒకరి ముఖం ఒకరు చూస్తూ మాట్లాడుకునేలా ఏర్పాటు చేసుకోవాలి. మన ప్రియమైన వారికోసం మనం కేటాయించే రోజులోని ప్రీమియం అవర్గా దీన్ని భావించాలి. కలిసి నడిచేలా: ఫోన్ ఉంటే ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నట్టు ఉంటుంది. కానీ కలిసి నడిచే కొద్ది సమయమైనా మనుషుల్ని మనసుల్ని దగ్గర చేస్తుంది. అందుకే కనీసం రెండు మూడు నెలలకు ఒకసారైనా చిన్నపాటి ట్రిప్లాంటిది ప్లాన్ చేయండి. ఒత్తిడికి దూరంగా గడిపే ఆ సమయంలో మనసులోని మాటలు తప్పక కలుస్తాయి.