బాసర : ఆర్జీయూకేటీ బాసర ( Basara Triple IT ) అడ్మిషన్ నోటిఫికేషన్‌పై సోషల్ మీడియా వదంతులు నమ్మరాదని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ ( VC Govardhan ) స్పష్టం చేశారు. త్వరలో ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆర్జీయూకేటీ బాసర నుంచి అధికారికంగా ఏ నోటిఫికేషన్ ( Notification ) విడుదల కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మరాదని పేర్కొన్నారు.
ఆర్జీయూకేటీ బాసర 2025- 26 సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయం నుంచి నూతన అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశామని వివరించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఆర్జీయూకేటి అధికారిక వెబ్ సైట్ , పత్రికల్లో ప్రకటన విడుదల చేస్తామని ఏవో రణధీర్ సాగి తెలిపారు.