Dasoju Shravan Kumar | ఆ రూ.300 కోట్లు గంగలో కలిసినయి.. ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దంటున్నడు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
Dasoju Shravan Kumar | రోడ్లు పోయి ఆగమైన పరిస్థితి నెలకొంది.. అదే పరిణామ క్రమంలో నేడు రేవంత్ రెడ్డి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్‌ను రద్దు చేస్తా అని ఎగిసిపడుతూ ఒక ప్రతిపాదనను చర్చలో పెట్టాడని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.
Dasoju Shravan Kumar | ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు, ఒక పబ్లిక్ పాలసీని ప్రవేశపెట్టేటప్పుడు. ఉన్నటువంటి పాలసీని మార్పులు చేసేటప్పడు విస్తృతమైన చర్చలు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక విజన్, ఆకాంక్షతో లోతైన అవగాహనతో పాలసీలన్నీ తయారు చేసి దాన్ని అమలు చేయాల్సిన అవసరముంటుంది.. ఇది కాకుంటే ప్రత్యామ్నాయ పాలసీలు ఏముంటాయి.. ఈ పాలసీల పరిణామ క్రమంలో వచ్చేట్వంటి లోటుపాట్లేంటి.. వాటిని ఎట్లా మనం సవరించుకుంటమని.. వీటన్నింటిని కూడా కూలంకషమైన రీతిలో చర్చ చేసిన తర్వాత విస్తృతమైన పరిశోధన చేసిన తర్వాత ప్రజల సమ్మతితో సంబంధిత స్టేక్ హోల్డర్స్‌తో చర్చించిన తర్వాత ఒప్పించుకున్న తర్వాత మాత్రమే పాలసీని అమలులోకి తీసుకురావాలి.. అది ప్రతిపాదించాలని సూచించారు.
ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని రియలైజ్..
మన ఇంట్లో ఏదో ఒక గోడను మార్పిడి చేయాలనుకుంటం.. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఫత్వాలు జారీ చేసినట్టుగా నిర్ణయాలు జారీ చేస్తూ ప్రజల మీద రుద్దుతూ అడ్డమైన రీతిలో ఏరకంగా వ్యవహరిస్తున్నరో మనం చూస్తున్నామని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ అన్నారు. కేబీఆర్ పార్క్ విషయమే ఒక పెద్ద ఉదాహరణ. ఇంకా చాలా ఉన్నాయి ఉదంతాలు, హెచ్‌సీయూ భూములను కొల్లగొట్టే, అడవులను విధ్వంసం చేసే ప్రయత్నం చేయడం, కేబీఆర్ చుట్టైతే పెద్ద జోక్.. రూ.300 కోట్లు ఖర్చు పెట్టాడు.. కానీ సడెన్‌గా ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని రియలైజ్ అయ్యాడు. 300 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిన తర్వాత చెట్లను కొట్టేసిన తర్వాత, లోతైన గుంతలు తవ్వాక, ప్రజలను నానా ఇబ్బందులు పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు వర్కవుట్ కాదని తెలుసుకున్నారు. వెనక్కి తీసుకున్నడు.. ఆ 300 కోట్లు గంగలో కలిసినయి.. చెట్లు, పుట్టలు పోయినయ్.. రోడ్లు పోయి ఆగమైన పరిస్థితి నెలకొంది.. అదే పరిణామ క్రమంలో నేడు రేవంత్ రెడ్డి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్‌ను రద్దు చేస్తా అని ఎగిసిపడుతూ ఒక ప్రతిపాదనను చర్చలో పెట్టాడని ఫైర్ అయ్యారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రీ ఆయనే.. ఇంకో 10-15 శాఖలు ఆయన దగ్గర పెట్టుకొన్నాడని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫుల్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక పార్ట్‌టైమ్, అసమర్థుడైన వ్యక్తి విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని స్వార్థపూరిత లాభంకోసం కావొచ్చు.. కార్పోరేట్ శక్తులను లాభం చేయడం కోసం కావొచ్చు.. కాంట్రాక్టలో, టెండర్లలో తెలంగాణలోని విద్యావ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తున్నరు.. అవగాహనా రాహిత్యం, దానికితోడు అహంకారం.. ఈరెండూ తోడైతే ఏ రకమైన విధ్వంసం జరుగుతదో తెలంగాణలో చూస్తున్నామన్నారు.
LIVE: MLC @sravandasoju Press Meet at Telangana Bhavan https://t.co/k5JdEN9Ein
— BRS Party (@BRSparty) November 22, 2026
Read Also :
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
Army Families Killed | లారీ ఢీకొట్టడంతో రెండు ముక్కలైన కారు.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి
Srinath Maganti | సుశాంత్ స్థానంలో కార్తీక్‌గా మెప్పించిన శ్రీనాథ్ మాగంటి.. ‘ఈఎన్ఈ రిపీట్’తో అద్భుత విజయం!
Sweet Potato | రూ.20కే లభించే ఈ కూరగాయతో ఎంతో ఆరోగ్యం.. చలికాలంలో తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..
Dasoju Shravan Kumar | ఆ రూ.300 కోట్లు గంగలో కలిసినయి.. ఇప్పుడు ఇంటర్ బోర్డు రద్దంటున్నడు : ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

