హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అన్ని అంశాలపై సవివరంగా మాట్లాడుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరిన ముఖ్యమంత్రి.. ఆదివారం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ.. తన అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతోనే అనుమతి నిరాకరించిందని ఆరోపంచారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ.. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం లండన్ నుంచి బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నానని సీఎం ఆ ట్వీట్లో పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని గంటల్లో తాను హైదరాబాద్‌కు వస్తున్నానని.. అకడికి వచ్చిన తర్వాత మిగిలిన అంశాలపై మాట్లాడుతా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.