హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జరుగుతున్న అరెస్టులన్నీ అక్రమ అరెస్టులేనని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటికే తన కుమారుడిని, ఇప్పుడు తనను అక్రమంగా అరెస్టు చేశారని వాపోయారు.
హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆదివారం కొండాపూర్లోని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించి 2 గంటపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.