హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సీఎం నివాళులు అర్పించారు. ‘నేటి బాలబాలికలే భావి భారత పౌరులు’ అని విశ్వసించి, ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని పేరొన్నారు.