– కొండేటి వేణుగోపాల్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ
పెన్పహాడ్, జనవరి 19 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుడు, అమరుడు కొండేటి వేణుగోపాల్ రెడ్డి 16వ వర్ధంతిని ఆయన స్వగ్రామం పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో సోమవారం కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన తల్లి కొండేటి లక్ష్మమ్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వంద రోజుల్లో అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఇంటి స్థలంతో పాటు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పింది.
ప్రజా పాలన దరఖాస్తులో కేవలం రాతలో తప్పా అధికారంలోకి వచ్చినా తమను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వేణుగోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్, కుసుమ సిద్దారెడ్డి. కుసుమ మల్లారెడ్డి, నర్సిరెడ్డి, నాతల వెంకట్ రెడ్డి, అనూష, రాధా, వలపట్ల లింగయ్య, ఉప సర్పంచ్ వరికుపల్ల రాము, చెన్నూ ప్రభాకర్ రెడ్డి, కొండేటి వెంకటేష్, కొండేటి రాములు, సోమయ్య, నాగయ్య పాల్గొన్నారు.