సుబేదారి/నయీంనగర్, అక్టోబర్ 19: ఓ వృద్ధుడు 13 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. నగరంలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్న 69 ఏండ్ల రిటైర్డ్ ఉద్యోగి భిక్షపతి, అదే కాలనీకి చెందిన 13 ఏండ్ల బాలికపై కన్నేశాడు. మంగళవారం మధ్యాహ్నం భిక్షపతి డబ్బు ఆశ చూపి ఆ అమ్మాయిని తన ఇంట్లోకి పిలిపించుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఏడుస్తూ బయటకు రావడంతో ఆమె పెద్దమ్మ ఆరా తీసి 100 నంబర్‌కు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని కేయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు భిక్షపతిపై పోక్సోచట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై సతీశ్ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.