‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, ఉప సర్పంచుల జాయింట్ చెక్ పవర్‌పై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ఉప సర్పంచుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో అయన మాట్లాడుతూ..
– ఉప సర్పంచుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్ రెడ్డి
చౌటుప్పల్, అక్టోబర్ 14 : గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, ఉప సర్పంచుల జాయింట్ చెక్ పవర్‌పై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ఉప సర్పంచుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో అయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలు ఏర్పడి పది నెలలు గడుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం మళ్లించేందుకు ఒత్తిడి చేయడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. నిధుల విడుదల కోసం సర్పంచులు, ఉప సర్పంచులు ఐక్యంగా పోరాడకుండా ఉండేందుకు వారిమధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
2018లో అప్పటి ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం ద్వారా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించిందని, దీనివల్ల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉప సర్పంచులు చెక్కులపై ఏడు రోజుల్లో సంతకం చేయాలనే ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఈ నిబంధన అవినీతిని అరికట్టే ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఉప సర్పంచ్‌లు సరైన కారణం లేకుండా చెక్కులపై సంతకం చేయకపోతే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.అంతేకానీ అందరికీ ఒకే విధమైన ఆంక్షలు విధించడం తగదన్నారు. ఉప సర్పంచుల జాయింట్ చెక్ పవర్‌ను యథాతథంగా కొనసాగించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై వెంటనే స్పందించి ఉప సర్పంచుల చెక్ పవర్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉప సర్పంచులకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించాలన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

