రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలకు నిరసనగా బుధవారం రైతులు చేపట్టిన దేవరకొండ మండలంలోని పడమటిపల్లి సబ్‌స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ....
– విద్యుత్ కోతలతో రైతులకు తీవ్ర నష్టం
– ఎండిపోతున్న పంటలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం
– పడమటిపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
నల్లగొండ, అక్టోబర్ 14 : రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలకు నిరసనగా బుధవారం రైతులు చేపట్టిన దేవరకొండ మండలంలోని పడమటిపల్లి సబ్‌స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంటలు కీలకమైన పొట్ట దశలో ఉన్న సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తుంటే, వాటిని కాపాడుకునేందుకు అవసరమైన విద్యుత్ అందకపోవడం బాధాకరమన్నారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
గ్రామాల్లో పంట పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన సందర్భాల్లో వాటి స్థానంలో కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించి, రైతులకు అవసరమైన సమయంలో నాణ్యమైన విద్యుత్ అందించేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నప్పటికీ ఉత్పత్తి చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. సాగునీరు, విద్యుత్ కొరతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలని, పంట నష్టపోయిన రైతులను గుర్తించి అర్హులకు నష్టపరిహారం అందించాలని రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఇంకా దేవరకొండ మండలం పడమటిపల్లి గెట్ వద్ద విద్యుత్ కోతలను నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, స్థానిక సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి, సర్పంచులు మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, నాగవరం వెంకటేశ్వర్ రావు, తోటకూర వెంకటయ్య, తిరుపతి నాయక్, సంకూ కొండల్ రెడ్డి, దేప శైలేందర్ రెడ్డి, కొమ్ము రామస్వామి, నూతనకంటి రఘు, పాత్లవత్ దాస్రూ నాయక్, జెల్ల రేణు గౌడ్, సూరి, యాదయ్య, చరణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

