Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
Actor Brahmaji | ప్రముఖ క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చేసిన పరోక్ష వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో జరుగుతున్న వివిధ నిరసనలు, ఆందోళనలను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ నెట్టింట పెద్దయెత్తున చర్చకు దారితీసింది.
Brahmaji | ప్రముఖ క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చేసిన పరోక్ష వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశంలో జరుగుతున్న వివిధ నిరసనలు, ఆందోళనలను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ నెట్టింట పెద్దయెత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా నీట్ (NEET) పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సాగుతున్న ఉద్యమాలను ఎగతాళి చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం నిరసన తెలపడం అనేది ఒక కొత్త వృత్తిగా (Protest is the new profession now) మారిపోయింది అంటూ బ్రహ్మాజీ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ప్రజా సమస్యలపై, వ్యవస్థల తీరుపై నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు మరియు ప్రజల పోరాటాలను ఆయన చులకన చేసేలా మాట్లాడారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి సెటైరికల్ కామెంట్లు చేయడం సరికాదని మండిపడుతున్నారు.
సామాజిక మాధ్యమాలలో బ్రహ్మాజీ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం ఎత్తుతున్న వారిని అవమానించేలా మాట్లాడిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ పలుమార్లు సోషల్ మీడియా పోస్టుల వల్ల వివాదాల్లో చిక్కుకున్న బ్రహ్మాజీ, ఈ తాజా వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.
Protest is the new profession now…
— Brahmaji (@actorbrahmaji) October 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

