తాండూర్: బెల్లంపల్లి ( Bellampalli ) ఏరియా పరిధిలోని మాదారం టౌన్ షిప్‌లోని సింగరేణి పిల్లల పార్కు( Childrens Park ) దుస్థితిపై సింగరేణి ఉన్నతాధికారులు ( Singareni senior officials ) స్పందించారు. పర్యవేక్షణ లేక నిరుపయోగంగా మారిన పార్కు పై గురువారం నమస్తే తెలంగాణ ఎన్టీ న్యూస్ డాట్ కామ్‌లో వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ కథనాల పై బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్ రెడ్డి తక్షణమే స్పందించారు. పార్కు పరిస్థితిపై స్థానిక సివిల్ అధికారులతో మాట్లాడారు. వెంటనే పార్కు నిర్వహణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మాదారం సివిల్ అధికారులు సిబ్బందితో పార్కు లోని పిచ్చి మొక్కలు, గడ్డిని యుద్ధప్రాతిపదికన తొలగించారు. వర్షంలో సైతం పనులు చేపట్టి పార్కును పిల్లల ఆటలకనుగుణంగా అందుబాటులోకి తేవడంతో కార్మిక కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతుంది .