రామగిరి, సెప్టెంబర్ 25 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు ఉత్సవాలు అక్టోబర్ 9 నుండి ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఉర్సు కమిటీ, ఇనాంధార్ ముతవలీల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉర్సు ప్రారంభ వేడుకల సందర్భంగా అక్టోబర్ 9న గంధం ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు నెల రోజుల పాటు కొనసాగనున్నట్లు చెప్పారు. గంధం ఊరేగింపులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారి డీఈ అశోక్, మాజీ కౌన్సిలర్ నవీన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు ఇబ్రహీం, ఇంతియాజ్, సిపిఎం నాయకులు హాశం సాబ్, మసి అడ్వకేట్, ఇనాంధార్ – ముతవల్లీలు సయ్యద్ సమీయుల్లా ఖాద్రి, సయ్యద్ గౌస్ ఉల్లా ఖాద్రి, సయ్యద్ ఉబేద్ ఖాద్రి, సల్మాన్ ఖాద్రి, అవైయిస్ ఖాద్రి, తబరేస్ ఖాద్రి, రయ్యన్ ఖాద్రి, ఉర్సు కమిటీ వైస్ ప్రెసిడెంట్లు హాశం, ఠాగూర్ అడ్వకేట్, ఇంతియాజ్ హుస్సేన్, జనరల్ సెక్రటరీ సమద్, కమిటీ సభ్యులు జియావుద్దీన్, పాషా, ఇర్ఫాన్, షఫీ పాల్గొన్నారు.