They Call Him OG | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషించిన పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాగా..సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సుజీత్ టీం సెలబ్రేషన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. గురువారం ఓజీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది సుజిత్ టీం. ఈ సందర్భంగా సుజీత్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఓజీలో మూడు ముఖ్యమైన సన్నివేశాలను కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేశామన్నాడు.
బెస్ట్ ఔట్పుట్ రాబట్టేందుకు పవన్ కల్యాణ్‌తో ఎలా పనిచేశాడో చెప్పుకొచ్చాడు. మొదట ఆయనను నమ్మకంగా ఒప్పించాలి.. ఒక్కసారి ఆయన ఒప్పుకన్నాడంటే చాలు.. ఇక ఏది అవసరమైతే అది చేసేందుకు రెడీగా ఉంటారన్నాడు సుజిత్. మొదటి రోజు ప్రియాంకా మోహన్ కపై వచ్చే లవ్ సీన్లను చిత్రీకరించాం. అదే రోజు గ్యాంగ్ స్టర్ సినిమాలో లవ్ సీన్లు ఎందుకు తీస్తున్నారని పవన్ కల్యాణ్ అడిగారు. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఫాలోఅప్ చేస్తామని పవన్‌కు హామీనిచ్చినట్టు చెప్పాడు సుజిత్.
రెండో రోజు ఓజాస్ గంభీర బాంబేలో కాలు పెట్టగానే వచ్చే వాటర్ సీక్వెన్స్ సీన్, ముంబై పోలీస్ స్టేషన్ సీన్లను షూట్ చేశాం. ఇక మూడో రోజు మధురై పోలీస్ స్టేషన్, ఫస్ట్ హాఫ్ లాడ్జ్ సీక్వెన్స్‌ను పూర్తి చేశామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఓజీలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఓజీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
They Call Him OG | ఓజీలో నేహాశెట్టి స్పెషల్ సాంగ్ కట్.. ఇంతకీ ఎందుకు తీసేశారో మరి..?
Jatadhara | గూస్బంప్స్ తెప్పించేలా సుధీర్ బాబు సోల్ ఆఫ్ జటాధర ట్రాక్
Dhadak 2 | ఓటీటీలోకి ‘ధడక్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!