సిటీకి నీటి కటకట
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో విపత్తును పసిగట్టలేక ..జలమండలి నిర్లక్ష్యంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు తిప్పలు తప్పడం లేదు
- జలమండలి నిర్లక్ష్యంతో తీవ్ర నీటి ఎద్దడి
- గ్రీన్ ట్యాంకర్లు, శుద్ధ జలాల పేరిట హడావుడి
- అవస్థలుపడుతున్న నగర ప్రజలు
సిటీ బ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ తెచ్చిన కరువుతో విపత్తును పసిగట్టలేక ..జలమండలి నిర్లక్ష్యంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు తిప్పలు తప్పడం లేదు. మునుపెన్నడూ లేనివిధంగా ట్యాం కర్లు రికార్డు స్థాయిలో బుక్కయ్యా యి. 20 వేల మార్క్‌ను దాటింది. జలమండలికి అత్యంత ఇబ్బందికరంగా మారిన వెస్ట్ సిటీకి తాగునీరు అందించే సింగూరు, మంజీరాకు ఎగువ నుంచి వరద లేకపోవడంతో నీటి నిల్వలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
భూ గర్భ జలాలు వేగంగా అడుగంటుతుండటం, ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుండటంతో ఇప్పుడు మేల్కొంది. పైపులైన్ ఇంటర్ లింకింగ్, నీటి పొదుపునకు గ్రీన్ ట్యాంకర్ల సేవలు అంటూ హడావుడి చేస్తున్నది. ఇదే దూకుడు ముందు నుంచి ప్రదర్శిస్తే ఈపాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవి. ఎంతో కొంత నీటి ఎద్దడిని తగ్గించేందుకు మార్గం సుగమం అయ్యేది. జలమండలి పరిధిలోని 45 ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీటిని తాగునీటి యేతర అవసరాలకు వినియోగించాలనే బృహత్తర కార్యక్రమానికి జలమండలి శ్రీకారం చుట్టింది. గ్రీన్ ట్యాంకర్ల వ్యవస్థను తీసుకురావడం చాలా ఉత్తమమైన నిర్ణయం. కానీ..ఈ గ్రీన్ ట్యాంకర్లను తీసుకురావడం చాలా ఆలస్యమైంది. ఆర్నెళ్లకు ముందు నుంచే గ్రీన్ ట్యాంకర్లపై ప్రజల్లో అవగాహన కల్పించి, ట్యాంకర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తే ఇప్పటికే చాలా వరకు అందుబాటులోకి వచ్చేవి. ఎస్టీపీల నీళ్లు గృహ నిర్మాణానికి ఉపయోగపడేలా నాణ్యత పరీక్షలు కూడా ఇంతకు ముందే ప్రారంభిస్తే..
ఈపాటికి ఎస్టీపీల్లో నిర్మాణ రంగానికి ఉపయోగపడేలా నీటిని శుద్ధి చేయడం ప్రారంభించే వారు. ఇప్పటి దాకా నీటి శాంపిళ్ల సేకరణ జరగలేదు. శుద్ధి చేసిన జలాలు నిర్మాణ రంగానికి ఎంత మేర ఉపయోగపడుతాయో అంచనా వేయలేదు. జలమండలికి చెందిన 45 ఎస్టీపీల నుంచి 1500 ఎంఎల్డీల నిరక జలాలు ప్రతిరోజు వృథాగా పోతున్నాయి. తాజాగా 19 ఎస్టీపీల నుంచి శుద్ధ జలాలు సేకరించేందుకు 28 గ్రీన్ ట్యాంకర్లను ప్రారంభించారు. మొత్తం 45 ఎస్టీపీల నుంచి శుద్ధ జలాలు సేకరించాలంటే వందలాది గ్రీన్ ట్యాంకర్లు కావాలి. కానీ ఇప్పటి దాకా 100 మాత్రమే జలమండలి వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నారు. మరికొన్ని ట్యాంకర్లు వచ్చేదెప్పుడు? 1500 ఎంఎల్డీల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించేదెప్పుడు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జలమండలి ముందసే స్పందించి ఈ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తే ఇలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితి వచ్చేది కాదని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
తప్పని నీటి కష్టాలు..
వెస్ట్ సిటీ సహా గ్రేటర్ పరిధిలోని 9 నియోజకవర్గాలకు మంజీరా, సింగూరు నీరు సరఫరా అవుతుంది. ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు జలమండలి ఇప్పుడు పనులు ప్రారంభించింది. కృష్ణా, గోదావరి సరఫరా నుంచి సింగూరు, మంజీరా పైపులైన్లకు ఇంటర్ లింక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటి నుంచి పనులు ప్రారంభిస్తే అవి పూర్తయ్యేసరికి నీటి సమస్య మరింత జఠిలం కానుంది. ఇప్పటికే వెస్ట్ సిటీలో నీటి ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయి. ట్యాంకర్ల డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నది. భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటుతున్నాయి. జలమండలి సరఫరా అరకొరగా వస్తుండటంతో ప్రజలు, ప్రైవేట్ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో నీళ్లు వీలైనంత తొందరగా రాకుంటే వెస్ట్ సిటీ తీవ్రమైన పరిస్థితులను చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా జలమండలి అధికారులు ఆలస్యం చేయకుండా పనులను తొందరగా పూర్తిచేసి నీటి ఎద్దడిని అధిగమించాలని వినియోగదారులు కోరుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

