Pawan Kalyan | స్టీల్ ప్లాంట్‌లో నిర్వహణ లోపంపై ప్రశ్న.. నాకు అనుభవం లేదంటూ బదులిచ్చిన పవన్ కళ్యాణ్!
Vizag Steel Plant | విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant)లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant)లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వైజాగ్ చేరుకుని బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్లాంట్ లోపల పరిస్థితిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయనకు ఒక కీలకమైన ప్రశ్న ఎదురైంది. స్టీల్ ప్లాంట్ లోపల భద్రతా ప్రమాణాలు సరిగా లేవని, ముఖ్యంగా యాజమాన్యం పర్యవేక్షణ మరియు నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయని ఒక లేడి రిపోర్టర్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ… ప్లాంట్ సాంకేతిక నిర్వహణకు సంబంధించిన విషయాలపై నాకు అనుభవం లేదంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు.
దీంతో పవన్ స్పందించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉంటూ, ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు “నాకు అనుభవం లేదు” అని చేతులు దూళిపేసుకోవడం బాధ్యతారాహిత్యమేనని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
రిపోర్టర్ : స్టీల్ ప్లాంట్‌లో నిర్వహణ లోపం ఎక్కువగా ఉందంటున్నారు..?
పవన్ కల్యాణ్ : దీనికి సంబంధించి నాకు అనుభవం లేదు, వాళ్లు అంటున్నారు, కమిటీకి చెప్పగలను. pic.twitter.com/XzzBo0rZjO
— Telugu Feed (@Telugufeedsite) June 9, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

