న్యూఢిల్లీ, జూలై 4: ఎంట్రీలెవల్ విభాగాన్ని మరింత బలోపేతంచేయడంలో భాగంగా రెనో సంస్థ..సరికొత్త క్విడ్ మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.53 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..గరిష్ఠంగా రూ.5.61 లక్షలు. పాత మాడల్‌తో పోలిస్తే కొత్త మాడల్‌ను టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ చేసినట్టు, 8 ఇంచుల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, రియర్‌వ్యూ కెమెరా, టీపీఎంఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, కేలెస్ ఎంట్రీ, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.