బడంగ్‌పేట, డిసెంబర్ 6: మద్యం తాగి వచ్చి తర చూ వేధిస్తున్న బావను హత్య చేసిన కేసులో అక్కాతమ్ముడికి రిమాండ్‌కు తరలించిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. పోలీస్‌స్టేషన్ పరిధిలోని సత్యసాయినగర్ జిల్లెల్‌గూడలో నివాసముంటున్న సరోజ (40), శ్రీను(21) అక్కాతమ్ముడు. వీరు టైల్స్ వర్క్ చేస్తుంటారు. వారికి వరుసకు బావ అయిన చంపాపేట్‌కు చెందిన రెడ్యా(45) కూడా టైల్స్ వర్క్ చేస్తుంటాడు. పదేండ్లుగా సరోజతో సన్నిహితంగా మెలుగుతున్నాడు.
ఈ క్రమంలో ఆమె నివాసముంటున్న ఇంటికి తరచూ వస్తూ వెళ్తుండేవాడు. చిన్న చిన్న విషయాలకు ఆమెతో గొడవ పడుతుండేవాడు. దీంతో విసిగిపోయిన సరోజ బావ తాగి వచ్చి వేధిస్తున్నాడని, అనవసరంగా గొడవ పడుతున్నాడని తన తమ్ముడు శ్రీనుకు చెప్పింది. తమ్ముడు ఇటీవల రెడ్యాను పలుమార్లు హెచ్చరించాడు. అయినా వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు.
దీంతో ఈ నెల 2న మద్యం తాగి వచ్చి సరోజను అత్యాచారం చేయబోయాడు. అప్పటికే అతని ప్రవర్తనతో విసిగిపోయిన అక్కాతమ్ముడు అడ్డుతొలిగించుకోవాలని, ముందే వేసుకున్న పథకంలో భాగంగా ఇంటి తలుపులు మూసి చపాతి కర్రతో తలపై పలుమార్లు బాదారు. దీంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.
అతనిని హస్తినాపురంలోని నవీన దవాఖానలో చేర్పించారు. కిందపడిపోయి తలకు గాయమైందని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అతన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. 5న రాత్రి 12 గంటలకు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.