హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా గుబ్బడిలో తాము కొనుగోలు చేసిన 4.30 ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారంటూ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఆయన సోదరుడు అశోక్ కుమార్ షావిలికి ఊరట లభించింది.
వారి భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్ అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ పుల్లా కార్తీక్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.